హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 గంటల పీపుల్స్ ఆర్ట్ ఫెస్టివల్

HYD: తెలంగాణ జానపద గాయని, సామాజిక కార్యకర్త అరుణోదయ విమలక్క 50 ఏళ్ల సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని నగరంలో 50 గంటల పీపుల్స్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో జానపద, విప్లవ గీతాలు, నృత్యాలు, ప్రసంగాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అరుణోదయ ఉద్యమ చరిత్రను ఆవిష్కరిస్తున్నారు.