హైదరాబాద్: 28°C
తెలంగాణ

"బధిరులకు న్యాయ సేవలు అందేలా చూడాలి"

MHBD: రేపు ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పారా లీగల్ వాలంటీర్లకు పలు సూచనలు చేశారు. సమాజంలోని మూగ, చెవిటి వారిని గుర్తించి ఉచిత న్యాయ సేవలు, హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. వైకల్యాల కారణంగా వారు న్యాయానికి దూరం కాకుండా అండగా నిలవాలని సూచించారు.