హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు రేపల్లెలో ఏర్పాట్ల పరిశీలన

BPT: అక్టోబర్‌ 1న సీఎం చంద్రబాబు నాయుడు రేపల్లెలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రజావేదిక, హెలీప్యాడ్‌ ఏర్పాట్లకు స్థలాలను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌తో కలిసి శనివారం సాయంత్రం ఏర్పాట్లను సమీక్షించారు.