హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ శ్రీరామరక్ష!

PLD: నరసరావుపేటలో ద్విచక్ర వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్‌ కీలకమని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. పట్టణ ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు.