హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

500 మందికి మెగా వైద్య సేవలు

నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నిర్వహించిన శిబిరంలో ప్రత్యేక వైద్యులు సుమారు 500 మందికి ఓపీ సేవలు అందించారు. వివిధ అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జిలానితో పాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.