హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లులో వైసీపీ ప్రజాప్రతినిధుల సన్మానం

ATP: గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల వైసీపీ ప్రజాప్రతినిధుల (ZPTC, MPP, MPTC) పదవీకాలం ముగిసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవలూ ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.