హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ నూతన ఛైర్మన్‌గా కేఎస్ రవికుమార్

మహబూబ్‌నగర్‌కు చెందిన సామాజికవేత్త, విద్యావేత్త, జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేఎస్ రవికుమార్ రెడ్ క్రాస్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.