హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లా పర్యాటకానికి ప్రచారం చేయండి'

GDWL: గద్వాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల విశిష్టతను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటాలని విద్యార్థులకు సూచించారు. పురాతన కట్టడాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.