హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి పనుల్లో నాణ్యత ఏదీ..?

ASR: కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ వద్ద వర్షాలకు కుంగిన కనెక్టింగ్ వాల్, రోడ్డుపై పడిన రాళ్లు, మట్టిని శనివారం మాజీమంత్రి పసుపులేటి బాలరాజు పరిశీలించారు. జాతీయ రహదారి నిర్మాణంలో నాణ్యతప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సరైన పర్యవేక్షణ, సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు నష్టపోతున్నారన్నారు. ఇకనైనా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు.