హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో అవగాహన కార్యక్రమం

విశాఖ రైల్వే స్టేషన్‌లో శనివారం బాలల సంక్షేమ సమన్వయ సమావేశం, 'నషా ముక్త్ భారత్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థ, యాచకత్వాన్ని అరికట్టేందుకు ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయాణికులకు, సిబ్బందికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.