MDK: నార్సింగి రైతు వేదికలో ప్రత్యేక అధికారి నీలిమ, ఏఓ భరత్‌కుమార్ నేతృత్వంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల ప్రగతికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, సర్పంచులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఎంఈవో గంగాబాయి, వైద్యాధికారి రవికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామాల అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరం


