హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ వ్యర్థాలతో పర్యావరణ సవాల్

RR: వినాయక నిమజ్జనాల అనంతరం నగరంలో పండుగ వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరిగింది. 2025లో 3,266 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు నమోదుకాగా, 2026లో ఈ మొత్తం 4,527 మెట్రిక్ టన్నులకు చేరింది. మట్టి విగ్రహాలు, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలతో పారిశుధ్య నిర్వహణపై భారం పెరిగింది. పండుగలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.