హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు

PPM: విద్యార్థుల్లో దృష్టి లోపాలను తొలిదశలోనే గుర్తించేందుకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్ డా. టి. జగన్ మోహనరావు తెలిపారు. గరుగుబిల్లి మండలం ఎస్.ఆర్.పేట పాఠశాలలో పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ పరీక్షల్లో కంటి సమస్యలున్న ఏడుగురు విద్యార్థులను కళ్లజోళ్లకు ఎంపిక చేసినట్లు చెప్పారు.