హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నంది నృత్య పోటీలు విజయవంతం'

నంద్యాలలో శ్రీ సాయి నాట్యాంజలి ఆధ్వర్యంలో 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. వివిధ ప్రాంతాల కళాకారులు, విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో ప్రతిభ చాటారు. విజేతలకు నంది జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. నృత్య కళలను ప్రోత్సహించడమే పోటీల ఉద్దేశమని నిర్వాహకులు డా. పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.