హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదాముల్లో భద్రతా ప్రమాణాలపై తనిఖీ

VSP: చినగదిలి పరిధిలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రత, సీసీ కెమెరాలు, షట్టర్లు, సీల్ వ్యవస్థ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.