SKLM: మెలియాపుట్టి జడ్పీ హైస్కూల్లో ఐదేళ్లుగా నిలిచిన బాయ్స్ టాయిలెట్ల నిర్మాణం ఎమ్మెల్యే గోవిందరావు చొరవతో పూర్తయింది. 2019లో మంజూరైన రూ.2.60 లక్షల పనులు మధ్యలో ఆగిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే స్పందించి నిధులు విడుదల చేయడంతో పనులు పూర్తయ్యాయి. శనివారం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే చొరవతో బాయ్స్ టాయిలెట్లు పూర్తి


