హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువత సాధించే విజయాలే వికసిత్ భారత్‌కు పునాది'

ATP: అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 'యువత భవితకు భరోసా' కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర కీలకమని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించి, ఉన్నత విద్య, వ్యాపార రంగాల్లో ఎదగాలని పిలుపునిచ్చారు.