హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త ఇంట తేనీటి విందు స్వీకరించిన ఎమ్మెల్యే

ATP: కుందుర్పి మండల కేంద్రానికి చెందిన దివ్యాంగ కార్యకర్త వెంకటేషులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. స్థానిక నాయకులతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేషులతో ముచ్చటించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.