హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ ధర పలికిన వినాయకుని లడ్డు..!

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం సెంటర్ ప్రాంతంలో ఉన్న వినాయకుని ఆలయ ప్రాంగణంలో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సత్యమని గజేంద్రుడు స్వామివారికి 18 కేజీల లడ్డును నివేదించారు. ఆ లడ్డుకి శనివారం వేలంపాట నిర్వహించగా గతంలో ఎన్నడు లేని విధంగా కోమటితిప్ప గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సత్తినేని మోహనరావు 1.10 లక్షలు పాట పాడారు.