హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కల్తీ ఆహారంపై ఉక్కుపాదం'

సూర్యాపేటలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఏడు కేసులను విచారించి రూ.69,500 జరిమానా విధించారు. కల్తీ, నాసిరకం ఆహారం విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు.