హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. డాక్టర్, కౌన్సెలర్, వార్డ్ బాయ్, చౌకీదార్ వంటి ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలి.