హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం

E.G: తుఫాన్ కారణంగా 25న వాయిదా పడిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని 28న నిర్వహించనున్నట్లు సీతానగరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వి.భవాని తెలిపారు. మండలంలోని అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1–19 ఏళ్ల వయసున్న 12, 889 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలంతా తప్పనిసరిగా మాత్రలు తీసుకోవాలని సూచించారు.