హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు

TPT: జిల్లాలోని నాగలాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో ఓ యువకుడికి గాయాలయ్యాయి. 1-బి అడంగల్ కోసం తండ్రి వెంకటేష్‌తో కలిసి కార్యాలయానికి వచ్చిన శివకుమార్‌పై అకస్మాత్తుగా ఫ్యాన్ పడింది. ఈ ఘటనలో ఆయన చెవికి గాయమైంది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంకటేష్ ఫిర్యాదుతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.