కృష్ణా: తిరువూరు నియోజకవర్గంలోని ఏడు సాగునీటి చెరువులకు రాకెట్ సప్లై ఛానల్ ద్వారా నీటిని అందించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కోరారు. వర్షాధారంగా ఉన్న ఈ చెరువులు 1,680 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని, నీటి కొరత నివారణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు అవసరమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు చెరువులకు నీరు..!


