హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మిషన్ మార్చ్‌పై దృష్టి సారించాలి'

AKP: పదో తరగతి విద్యార్థుల కోసం అమలవుతున్న మిషన్ మార్చ్ కార్యక్రమంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని నక్కపల్లి ఎంఈవో కే.నరేష్ సూచించారు. శనివారం స్థానిక బాలికోన్నత పాఠశాల, చినదొడ్డిగల్లు ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ తరగతులను ఆయన పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులతో అభ్యాసాలు చేయించి, వారాంతపు పరీక్షల నిర్వహించాలన్నారు.