హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికసిత్‌ భారత్‌ పై విద్యార్థులకు పోటీలు

SDPT: హుస్నాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా 'నా కలల భారత్-వికసిత్ భారత్ 2047' అంశంపై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 250 మంది పాల్గొని తమ ఆలోచనలు, ఆకాంక్షలను వ్యక్తం చేశారు. విజేతలకు స్మారక చిహ్నాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో BJP, BJYM నాయకులు పాల్గొన్నారు.