హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బహిరంగ మద్యపానంపై చర్యలు తీసుకోవాలి'

CTR: నగరి బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్ సమీపంలోని రెండు మద్యం దుకాణాలను పట్టణ శివార్లకు తరలించాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. బస్టాప్‌ సమీపంలో మద్యం దుకాణాలు ఉండటంతో ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.