గుంటూరులో వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. చంద్రమౌళినగర్‌లోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ ధైర్యం, సాహసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బీసీ రక్షణ చట్టం, సంక్షేమ పథకాలు, పెన్షన్లపై ప్రత్యేక దృష్టి ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐలమ్మ స్ఫూర్తితో సేవ చేయాలి: ఎమ్మెల్యే


