విజయనగరంలో ఏపీ తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ యశస్వి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు జనసేనలో చేరాయి. ఈ సందర్భంగా ఆమె వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్‌పర్సన్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు


