హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ బూత్ మార్పునకు వినతి

NTR: జగ్గయ్యపేటలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎనిమిదో వార్డు పోలింగ్ బూత్‌ను మార్చాలని గడ్డం రాంబాబు యాదవ్ మున్సిపల్ కమిషనర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. తొర్రగుంటపాలెం ప్రభుత్వ పాఠశాల దూరంగా ఉండటం, వృద్ధులు, మహిళలకు అసౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ పార్కులోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో బూత్ ఏర్పాటు చేయాలని కోరారు.