హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మిడివలస పొలాల్లో ఏనుగుల గుంపు

పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామ పరిసర పొలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు శనివారం తెలిపారు. సమీప గ్రామాల రైతులు పొలాలకు, అరటి తోటలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. ఎప్పటికప్పుడు ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలను పాటిస్తూ ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.