హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలో విజయవాడకు అనుమతి లేదు: ఎస్పీ

ATP: సచివాలయ ఉద్యోగుల సంఘం ఈనెల 27న తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ధర్నాలు, ర్యాలీలకు వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.