హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో పర్యటించనున్న మంత్రి బీసీ

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మహిళా నాయకులు, కూటమి నేతలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.