హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ సుబ్బయ్య హోటల్ వద్ద స్తంభించిన ట్రాఫిక్

కాకినాడలోని సుబ్బయ్య హోటల్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 30 నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.