AKP: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇంఛార్జ్ ఆర్డీవో వై.శ్రీనివాసరావు శనివారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షించారు. స్కానింగ్ కేంద్రాలు రికార్డులు, ఫారం-ఎఫ్ పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రాలపై నిఘా ఉంచి, తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు'


