హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా కొవ్వూరుపాడు వంతెన

E.G: సాగిపాడు నుంచి గోపాలపురం వెళ్లే మార్గంలోని కొవ్వూరుపాడు వద్ద ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతంలో ఉన్న కాజ్‌వే కావడంతో కొద్దిపాటి వర్షానికే వర్షపు నీరు వంతెనపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.