హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులతో మమేకమైన ఎంపీ

NLR: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో భాగంగా శనివారం వింజమూరు మండలం నేతాజీ డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.