హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దవడ్లపూడిలో CMRF చెక్కుల పంపిణీ

GNTR: మంగళగిరి(M) పెద్దవడ్లపూడిలో శనివారం ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.10,17,180 విలువైన చెక్కులను మార్కెట్‌ యార్డు చైర్మన్‌ జువ్వాది కిరణ్‌చంద్‌ అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ సాయం భరోసానిస్తుందని తెలిపారు. అర్హులకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.