హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం

ప్రకాశం: ఒంగోలు నగరంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన శనివారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో పటిష్టంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులు కలిసికట్టుగా పని చేయాలన్నారు.