హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్‌ కార్యకర్తలకు గంటా అంజిబాబు పిలుపు

BPT: బాపట్ల 1వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. బేతనీకాలనీలో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయాలని, నాయకులు–కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.