హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎంఎఫ్ నిధులతో రహదారులకు మహర్దశ

కృష్ణా: నందిగామ నియోజకవర్గంలో గనుల రవాణా వల్ల దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రూ. 4.78 కోట్ల డీఎంఎఫ్ నిధులకు పరిపాలనా అనుమతులు లభించాయి. సెప్టెంబర్ 2026లో ఈ అనుమతులు జారీ చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పనులతో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆమె తెలిపారు.