హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు'

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్-మీ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కేంద్రాన్ని హోంమంత్రి అనిత శనివారం ప్రారంభించారు. పౌరులకు పోలీస్ సేవలను సులభతరంగా, పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు ఈ-ఫిర్యాదుల కీయాస్క్‌ను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ-ఫిర్యాదు కీయాస్క్‌ను పీజీఆర్ఎస్‌కు అనుసంధానం చేశామన్నారు.