హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం

ప్రకాశం: కనిగిరి మండలం గురువాజీపేట-2, కృష్ణాపురం అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం పోషణ మాసోత్సవాల్లో భాగంగా ‘అంగన్‌వాడీ ఉత్సవం’ నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వి.ఎస్. పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, రక్తహీనత నివారణ, వ్యాక్సినేషన్, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.