హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అధికారిగా గంగాభవాని బాధ్యతల స్వీకారం

TPT: తిరుపతి గ్రామీణ మండల ప్రత్యేక అధికారిగా గంగాభవాని శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా పనిచేస్తామని గంగాభవాని తెలిపారు. మండల అభివృద్ధికి అవసరమైన చర్యలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.