హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాలుగు టన్నుల వ్యర్థాలు తొలగింపు'

AKP: స్వచ్ఛతా హీ సేవా-2026లో భాగంగా ఎలమంచిలి పెంజెరువు ఘాట్‌లో వినాయక నిమజ్జనం అనంతరం పేరుకుపోయిన సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అనంతరం ఘాట్‌ను శుభ్రపరిచి ముగ్గులతో అలంకరించారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు కోరారు. ఇందులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.