కడప: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 31, నవంబర్ 1న 'కడప బాలోత్సవం 4.0' జరగనుంది. శనివారం పోస్టర్లను ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి ఆవిష్కరించారు. పిల్లల్లో ఒత్తిడి తగ్గించి, మానవతా విలువలు, సమానత్వం పెంపొందించేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. పిల్లలలో మానసిక వికాసానికి తోడ్పడే ఈ 4వ పిల్లల పండుగను జిల్లా ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో బాలోత్సవం పోస్టర్ల ఆవిష్కరణ


