హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పకడ్బందీగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు'

MLG: గ్రామాల అవసరాలకు అనుగుణంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు సూచించారు. శనివారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలకు శిక్షణ ఇచ్చారు. గ్రామ అవసరాలను గుర్తించి పనులు ఎంపిక చేయాలని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అక్టోబర్ 2న గ్రామసభలో ప్రణాళికకు ఆమోదం పొందాలని వెల్లడించారు.