హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విష్ణుమూర్తి మృతి పార్టీకి తీరని లోటు: మంత్రి

KKD: కాజులూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు బొడ్డు విష్ణుమూర్తి మృతి పార్టీకి, మండల ప్రజలకు తీరని లోటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం ఆర్యవటం గ్రామంలోని విష్ణుమూర్తి స్వగృహానికి వెళ్లిన మంత్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.