సత్యసాయి: పరిగిలో పేకాట స్థావరంపై ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో జరిపిన ఈ దాడిలో రూ. 3,100 నగదు, 3 బైక్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గతంలో బైండోవర్ అయిన వ్యక్తి కూడా ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పరిగిలో పేకాటరాయుళ్ల అరెస్ట్


