హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం

TPT: జిల్లాలోని ఓజిలి మండల కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగలగొట్టి సుమారు 90 సవర్ల బంగారం, రూ.3 లక్షల నగదును అపహరించారు. ఓజిలికి చెందిన బత్తిన మురళీకృష్ణ పని నిమిత్తం నాయుడుపేటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.